విజయ్ సినిమా వచ్చేది అప్పుడే.!

Friday, April 3rd, 2020, 12:58:22 PM IST


టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇజబెల్,క్యాథరిన్,ఐశ్వర్య రాజేష్ అలాగే రాశి ఖన్నాలు హీరోయిన్లుగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. ఈ సినిమా విడుదల ముందు వరకు విజయ్ ఏదొకలా తదైనా శైలి ప్రమోషన్స్ చేసి తనకి కావాల్సిన హైప్ ను బాగానే తెచ్చుకున్నాడు.

కానీ ఈ చిత్రాన్ని విజయ్ ఎంత లేపినా ప్రేక్షకులు మాత్రం లేపడానికి ఇష్టపడలేదు. అయితే ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సన్ నెక్స్ట్ వారు ఈ చిత్రాన్ని రేపు ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం. వెండి తెర మీద క్లిక్ కానీ ఈ చిత్రం అరచేతిలో అయినా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.