విజయ్ ప్లాప్ సినిమాను ఈ రేంజ్ లో చూస్తున్నారా?

Wednesday, January 22nd, 2020, 01:13:51 PM IST

“అర్జున్ రెడ్డి” సినిమాతో టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ చిత్రం ఇచ్చిన ఫేమ్ ను అలా కాపాడుకోడానికి తాను ఇప్పటి వరకు చేసిన ఫీట్లు అన్ని ఇన్ని కావు.అయితే అది కూడా ఒక స్ట్రాటజీయే కానీ ఇప్పుడు విజయ్ అడుగు మాత్రం బాలీవుడ్ వైపు వెళ్ళింది.ఒక్క తెలుగులోనే కాకుండా విజయ్ బాలీవుడ్ సినిమాలపైన కూడా దృష్టి పెట్టాడు.

అయితే హిందీ జనం విజయ్ ను ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో అన్న ప్రశ్నకు అతని కెరీర్లో ప్లాప్ గా నిలిచిన ఓ చిత్రం ఊహించని రేంజ్ సమాధానం ఇచ్చింది.”అర్జున్ రెడ్డి” తర్వాత “ఏ మంత్రం వేసావే” అనే సినిమా ఒకటి రిలీజ్ అయ్యి ఎటు పోయిందో కూడా ఎవరికీ తెలీదు కానీ దాని తర్వాత వచ్చిన “గీత గోవిందం” సినిమా అయితే ఊహించని వసూళ్లను రాబట్టింది.

అలా దాని తర్వాత వచ్చిన “నోటా” మరియు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన “డియర్ కామ్రేడ్” చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ప్లాప్ అయ్యాయి.కానీ వాటిలో “డియర్ కామ్రేడ్” హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చెయ్యగా దానికి రెండు రోజుల్లోనే 23 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి.ఇది మాములు రికార్డు స్థాయి వ్యూస్ కాదని చెప్పాలి.23 మిలియన్ వ్యూసే అనుకుంటే 5 లక్షలకు పైగా లైక్స్ కూడా దీనితో ఈ రెస్పాన్స్ ను చూసి నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.