యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తున్న వకీల్ సాబ్..!

Wednesday, March 31st, 2021, 12:19:18 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి నిన్న ట్రైలర్‌ కూడా రిలీజ్ చేసింది చితృ బ్రందం.

అయితే ఆడపిల్లల తరపున న్యాయం కోసం పవన్ పోరాడుతుండడం, కోర్టులో పవన్ డైలాగ్స్ వంటివి అబిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తుంది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 22.44 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు అత్యంతవేగంగా 23 గంటల 39 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ సంపాదించుకుంది.