“అమృతం 2” టీం నుంచి ఊహించని బహుమతులు!

Wednesday, March 25th, 2020, 01:15:00 PM IST


మన తెలుగు ఎవర్ గ్రీన్ సీరియల్ అయినటువంటి “అమృతం” సీరియల్ మరోసారి “అమృతం ద్వితీయంగా” మొదలు కాబోతుంది అని చాలా రోజులు నుంచి మనం వింటున్నాం.దీనితో దీని కోసం ఈ సీరియల్ ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూసారు.

అయితే ఇప్పుడు ఈ తరుణం రానే వచ్చేసింది. ఈ ఉగాది పర్వదినాన మార్చ్ 25 నుంచి ఈ ధారావాహిక జీ 5స్ట్రీమింగ్ యాప్ నుంచి రానున్నట్టుగా వారు తెలిపారు.అలా చెప్పేసినట్టుగానే వారు ఈరోజు జీ 5 నుంచి వచ్చేసారు.ఇదే అనుకుంటే ఇప్పుడు వీరు ఒక ఊహించని బహుమతిని ఇచ్చారు అని చెప్పాలి.

ఎందుకంటే కేవలం ఒక్క ఎపిసోడ్ కాకుండా మొత్తం మూడు ఎపిసోడ్స్ ను తమ వీక్షకుల కోసం తీసుకొచ్చారు. మరి ఈ మూడు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో తెలియాలి అంటే జీ 5స్ట్రీమింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఈ ఉగాదిని మరింత ఆనందంగా జరుపుకోండి..