ఓటిటి రిలీజ్ వల్ల వచ్చే నష్టం లేదంటున్న ప్రముఖ నిర్మాత.!

Tuesday, June 2nd, 2020, 04:44:31 PM IST

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడ్డాయి. దీనితో అప్పటికే విడుదలకు రెడీ కాబడిన ఎన్నో సినిమాలు ఇక చేసేది ఏమి లేక డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీనితో ఇక ముందు నుంచి రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతాయేమో అలా అయితే చలన చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏంటా అని చాలా మంది సిని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..

మరికొంత మంది నిర్మాతలు మాత్రం ఈ ఓటిటి రిలీజ్ వల్ల టాలీవుడ్ కు వచ్చే నష్టమేమి లేదని చెప్పేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామ అదే అంటున్నారు. సినిమాను జనం ఎప్పటికీ థియేటర్స్ లోనే ఎంజాయ్ చెయ్యగలరు అని ఇది జస్ట్ చిన్న బ్రేక్ లాంటిదే అని తెలిపారు. ఇటీవలే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విఐ దేవరకొండతో చేసిన “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రంతో 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు.