ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో ప్రతీ శనివారం టెలికాస్ట్ అయ్యే “క్యాష్” షో కూడా ఒకటి. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోకు ప్రతీ వారం కొంతమంది సెలెబ్రెటీలు వచ్చి తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. అలా ఈ షోకు మొట్టమొదటి సారిగా మన సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క రాకతో టాప్ రేటింగ్ కంపించింది.
స్వీటీ వచ్చిన మొదటి ప్రోమో తోనే యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను రాబట్టుకున్న ఈ ఎపిసోడ్ అనుకున్నట్టుగానే “క్యాష్” ఎపిసోడ్స్ లో భారీ టీఆర్పీ ను నమోదు చేసినట్టుగా టెలివిజన్ బ్రాడ్ క్యాస్టింగ్ వారు తెలియజేసినట్టు సమాచారం.గత మార్చ్ 21న ప్రసారం అయిన ఈ గ్రాండ్ ఎపిసోడ్ కు గాను 10.4 టీఆర్పీ (CSF 15+ABC) వచ్చిందట. ఇది ఆ రోజు ప్రసారం అయిన ఏ ఇతర చానెల్స్ షోలకు కానీ ఈ స్థాయి రేటింగ్ రాలేదు. మొత్తానికి స్వీటీ రాకా టీఆర్పీ ను షేక్ చేసిందని చెప్పాలి.