సుశాంత్ సింగ్ చివరి సినిమా విడుదల ఆరోజేనే..!

Sunday, July 5th, 2020, 10:28:47 PM IST

నిజంగా ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ ఆడియన్స్ మరియు సినిమా మేకర్స్ కి ఒక విషాదకర ఏడాది గానే నిలిచిపోతుంది అని చెప్పాలి. బాలీవుడ్ కు చెందిన గొప్ప టాలెంట్ ఉన్న నటులు అంతా ఈ ఏడాదిలోనే కన్ను మూయడం నిజంగా విషాదకరం.

ముఖ్యంగా ఎన్నో అనుమానాలు రేపుతూ ఏంతో భవిష్యత్ ఉన్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మరింత విషాదాన్ని నింపింది. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అన్నది ఇంకా తెలియలేదు కానీ తాను చివరగా నటించిన చిత్రం “దిల్ బెచారా” మాత్రం ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది.

నేరుగా డిజిటల్ గా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులు థియేటర్ లలోనే విడుదల చెయ్యమని డిమాండ్ చేశారు. కానీ ఫైనల్ గా మాత్రం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

ఈ చిత్రం వచ్చే జూలై 24 న డిజిటల్ ప్రీమియర్ గా హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ఉన్నవారికి అందుబాటులో రానుంది. అలాగే ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది.