టాప్ లో ట్రెండ్ అవుతున్న సుధీర్ అండ్ రష్మీ జోడి..!

Thursday, July 9th, 2020, 10:08:40 AM IST

తెలుగు బుల్లితెరపై ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్న జంట ఎవరైనా ఉన్నారు అంటే అది సుడిగాలి సుధీర్ మరియు రష్మీ గౌతమ్ ల జంటే అని చెప్పాలి. తెలుగు సెన్సేషనల్ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా పరిచయం అయిన వీరు స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా మందికి ఎంతో ఇష్టం. అలా ఇప్పుడు వీరు కలిసి పలు షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈటీవీలో మరో షో “ఆలీతో సరదాగా” కు వీరు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. వీరు వచ్చిన ఈ ప్రోమో వీరి ఫ్యాన్స్ కి ఎంత గానో నచ్చింది.

అలా ఈ ప్రోమో ఇంకా 24 గంటలు పూర్తి కాక ముందే 1.3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ 3 లో ట్రెండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే జూలై 13 సోమవారం రాత్రి మీ ఈటీవీలో “ఆలీతో సరదాగా” షోను అస్సలు మిస్సవ్వద్దు.