మరో మైల్ స్టోన్ ను టచ్ చేసిన బన్నీ.!

Friday, March 27th, 2020, 10:25:29 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపేసింది.

అయితే ఈ చిత్రం విడుదలకు ముందే సంగీతం పరంగా ఈ సినిమాను స్యూర్ షాట్ హిట్ ని చేసేశాయి. అదే ఊపులో థియేటర్స్ లో పడ్డ ఈ చిత్రం మరింత హిట్టయ్యింది. పాటలు అయితే విజువల్ గా మరింత స్థాయిలో ఆకట్టుకున్నాయి.

వాటిలో పార్టీ సాంగ్ రాములో రాముల అయితే సినిమా విడుదల కాకముందు అయినా తర్వాత అదే స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఈ లిరికల్ వీడియో సాంగ్ ఫాస్టెస్ట్ ఐ మిలియన్ లైక్స్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే,ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ కూడా లాగే దూసుకుపోతుంది.

ఈ పాత యూట్యూబ్ లోకి వచ్చిన మూడు వారాల్లోనే 41 మిలియన్ వ్యూస్ తో పాటు 400కే లైక్స్ నాలుగు లక్షల లైక్స్ మార్క్ ను టచ్ చేసిన 5 లక్షల లైక్స్ వైపుగా దూసుకుపోతుంది. దీనితో బన్నీ మరో మైల్ స్టోన్ ను టచ్ చేసాడని చెప్పాలి.