స్టార్ మాలో సరికొత్త ధారావాహిక.. కస్తూరిగా మీ ముందుకు..!

Monday, September 21st, 2020, 03:21:16 PM IST

మన నిజజీవితంలో జరిగే ఎన్నో సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఒక్క రోజు చూస్తే చాలు ప్రతి రోజూ చూడాలనిపించేలా ఆ సమయానికి ఇంటిల్లిపాదిని టీవీల ముందు కట్టిపాడేసే ధారావాహికలు మన ముందుకు ఎన్నో వచ్చాయి. అయితే అలాంటి ధారావాహికలను మరిపించేలా ప్రేమతో మనసులను గెలిచే అమ్మాయి తన కథతో మీ ముందుకు “కస్తూరిగా” వస్తుంది.

పగతో రగులుతున్న గతానికి ప్రేమతో బదులు చెప్పిన ఈ తరం అమ్మాయి కథతో, ఈ రోజు నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ మాలో మీ మన్ననలు పొందేందుకు వస్తున్న “కస్తూరిని” కూడా ఆదరించి ఆశీర్వదిస్తారని దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ప్లయింగ్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆర్కే మాలినేని దర్శకత్వంలో, సాకమూరి నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్‌లో ఐశ్వర్య హీరోయిన్‌గా, నాగార్జున్ హీరోగా మరియు సూర్య, వాసుదేవ్, మీనా, వర్ష, వీనా వంటి వారు లీడ్ రోల్‌లో కనిపించబోతున్నారు.