స్టార్ మాలో మరో సరికొత్త సీరియల్.. c/o అనసూయ నేటి నుంచే..!

Monday, October 12th, 2020, 12:26:18 PM IST

స్టార్ మాలో ప్రసారమయ్యే సినిమాలకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే నేటి నుంచి స్టార్ మాలో c/o అనసూయ అనే సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతుంది. కార్తీక దీపంలో నటించిన సౌందర్య (అర్చన ఆనంత్), కోయిలమ్మ సినిమాలో అద్భుతంగా నటించిన చిన్ని (తేజశ్విని గౌడ), సిరిసిరి మువ్వలు సినిమాలో హీరోగా నటించిన అశ్విన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

అయితే కథ పరంగా చూసుకుంటే ఓ తల్లి తన ఇద్దరి కూతుళ్ళను ధనవంతులకు ఇచ్చి చేయాలని తపన పడుతూ ఉంటుంది. అంతేకాదు అందుకు తగ్గట్టుగానే ధనవంతులుగా ఎలా మెలగాలనేది ముందు నుంచే తన కూతుళ్ళకు నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఆ తల్లి కోరుకుంటున్నట్టుగానే తన కూతుళ్ళను ధనవంతులకు ఇచ్చి పెళ్ళి చేస్తుందా లేదా, తన కూతుళ్ళ జీవితాలలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి అనేది తెలియాలంటే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ మాలో వచ్చే c/o అనసూయ సీరియల్‌ని తప్పక చూడాల్సిందే.