స్టార్ మా సరికొత్త సీరియల్ కు షాకిస్తున్న నెటిజన్లు!

Thursday, February 13th, 2020, 07:11:59 PM IST

ఇటీవలే మన తెలుగులో ఉన్నటువంటి పలు ఛానెల్స్ కొన్ని సరికొత్త ధారావాహికలను బుల్లితెర ఆడియెన్స్ కోసం పరిచయం చేసారు.అలా చేసిన వాటిలో స్టార్ మా వారు ప్రారంభం చేసిన “ఇంటింటి గృహ లక్ష్మి” ధారావాహిక కూడా ఒకటి.అయితే ఈ సీరియల్ మొదలయ్యి ఇప్పటికి వారం పూర్తయ్యిపోయింది.ఎలాగో కొత్త సీరియల్ కాబట్టి ఆడియన్స్ ఒక రెండు వారాల పాటు మిస్సవ్వకుండా చూడడం ఏ సీరియల్ కు అయినా సరే తప్పని సరి.అలా ఈ సీరియల్ ను కూడా వీక్షిస్తుండడంతో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది.

కానీ ఈ సీరియల్ కాన్సెప్ట్ పైనే నెటిజన్లు మండిపడుతున్నారు.ఓ తల్లి పాత్రను ఈ విధంగా చూపిస్తారా అని ఈ సీరియల్ తో వీక్షకులకు వారి టీం అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మండిపడుతున్నారు.అంతే కాకుండా ఈ సీరియల్ యూట్యూబ్ లేటెస్ట్ ప్రోమోలకు లైక్స్ తో పాటుగా డిస్ లైక్స్ ను కూడా ఎక్కువగానే వస్తున్నాయి.ఇది స్టార్ మా ఛానెల్లో ఏ సీరియల్ కు జరగలేదని చెప్పాలి.మొత్తానికి మాత్రం కామెంట్స్ రూపంలో కూడా ఈ సీరియల్ కు చాలా నెగిటివిటి వస్తుంది.మరి రాబోయే రోజుల్లో యాజమాన్యం ఈ సీరియల్ ను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.