స్టార్ మా కూడా ఈటీవీ బాటలోనే.!?

Thursday, April 2nd, 2020, 11:07:56 AM IST

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మన తెలుగు ఛానెల్స్ వారు ప్రభుత్వ సూచనల నిమిత్తం తమ సీరియల్స్ మరియు షోల షూటింగ్స్ ను కొన్నాళ్ల పాటు వాయిదాలు వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో పలు ఛానెల్స్ వారు తమ ప్రస్తుత సీరియల్స్ వే పాత ఎపిసోడ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అలాగే మరికొన్ని ఛానెల్స్ వారు తమ పండుగ ఈవెంట్స్ ను రీ టెలికాస్ట్ చేస్తున్నారు.

అయితే వీటిలో ఈవెంట్స్ కు పేరు పెట్టిన ఈటీవీ వారు గడిచిన ఈవెంట్స్ ను మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇపుడు ఈటీవీ బాటలోనే స్టార్ మా వారు కూడా వెళ్తున్నారు. ఎన్ని రోజులు తమ ఈవెంట్స్ తో అదరగొట్టిన ఈటీవీ లానే ఇప్పుడు స్టార్ మా వారు కూడా తమ పండుగ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు తమ బిగ్ బాస్ ఉత్సవాన్ని టెలికాస్ట్ చేశారు. మరి ఇక్కడే ఆపేస్తారా లేక ఈటీవీ లానే మిగతా ఈవెంట్స్ ను కూడా టెలికాస్ట్ చేస్తారో లేదో చూడాలి.