ఆ ఒక్కడిని టార్గెట్ చేసిన శ్రీముఖి ..మాస్క్ తీసేసింది..? రచ్చ షురూ

Monday, September 30th, 2019, 01:43:14 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 లో స్ట్రాంగ్ కంటిస్టెంట్ ఎవరయ్యా అంటే అది ఖచ్చితంగా అలీ రెజా అనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి వచ్చిన అలీ రెజా తనదైన ఆట తీరుతో స్ట్రాంగ్ పొజిషన్ కి చేరుకున్నాడు . అయితే ఎవరు ఊహించని విధంగా అలీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాడు. దీనితో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు, ఎలా అయితే హౌస్ నుండి అనుకోని విధంగా వెళ్లిపోయాడో, అదే స్థాయిలో అనుకోని విధంగా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు అలీ.

అలీ రాకతో అందరు హ్యాపీ గా ఉన్నట్లు మొదటి రోజు తెలిసింది, కానీ ఒక స్ట్రాంగ్ కంటిస్టెంట్ హౌస్ లోకి వచ్చాడని ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ముఖ్యంగా శ్రీముఖి ఈ విషయంలో మాస్క్ వేసుకొని అలీతో ఉంటుంది, తాజాగా నిన్న జరిగిన కిస్ అండ్ కిల్లింగ్ టాస్క్ లో అలీ గురించి శ్రీముఖి ఏమి అనుకుంటుందో ఓపెన్ గా చెప్పేసింది. అలీని హౌస్ నుండి పంపించాలని అనుకుంటున్నానంటూ అతని ఇమేజ్ మీద కత్తితో గుచ్చింది.

అలీ బయటకు వెళ్లి లోపలి వచ్చాడు. కాబట్టి బయట ఏమి జరుగుతుందో, ఎవరు ఎలా ఆడుతున్నారో అతనికి బాగా ఐడియా ఉంటుంది. అది ఆలీకి 40 % ప్లస్ అవుతుంది. ఆలా బయటకు వెళ్లివచ్చిన అలీ మాకు స్ట్రాంగ్ పోటీదారుడు అవుతాడు, అందుకే అతన్ని బయటకు పంపించాలని అనుకుంటున్నా అంటూ శ్రీముఖి తాను ఏమి అనుకుంటుందో ఓపెన్ గా చెప్పేసింది. బహుశా గేమ్ చివరిదశకు వచ్చింది కాబట్టి ఇక మాస్క్ లు వేసుకుంటే లాభం లేదనుకొని ఇలా ఓపెన్ అయివుండొచ్చు ..