స్మాల్ స్క్రీన్ పై బాగా నిరాశ పరిచిన ఖైదీ..!

Friday, July 3rd, 2020, 02:53:19 PM IST

తమిళ హీరోల లో మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో కార్తీక్ కూడా ఒకడు. కార్తీక్ సినిమాలకు మన దగ్గర కూడా మంచి డిమాండ్ ఉంది కానీ గత కొన్నాళ్ల నుంచి కార్తీకి సరైన హిట్ లేదు. అదే సమయంలో దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో ఖైదీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు గత ఏడాది దీపావళి వచ్చాడు ఆ సమయంలో ఈ చిత్రం అటు తమిళ మరియు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అలా అప్పటికప్పుడు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం మన తెలుగు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూశారు. అలా చాలాకాలం సస్పెన్స్ తర్వాత ఈ చిత్రం మన తెలుగు స్ట్రీమింగ్ ఆప్ ఆహా లో అందుబాటులోకి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్లో ప్రసారం చేశారు. అయితే ఈ సినిమాను ప్రకటించినప్పుడు మిమిమం రేటింగ్ అయినా రాబడుతుంది అని అనుకున్నారు.

కానీ ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది అని ఎవరూ ఊహించి ఉండరు. ఈ చిత్రానికి మొట్ట మొదటి టెలికాస్ట్ లో కేవలం 3.45 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ను మాత్రమే సంపాదించినట్టు తెలుస్తుంది. మన తెలుగు ఆడియెన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై ఒక ఊపు ఊపిన ఈ థ్రిల్లింగ్ చిత్రం స్మాల్ స్క్రీన్ పై ఇంత దారుణంగా రేటింగ్ రావడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి.