కరోనా వల్ల ఎంతలా ఇబ్బంది పడిందో చెప్పిన సీరియల్ హీరోయిన్.!

Thursday, July 2nd, 2020, 07:02:30 PM IST

ఊహించని విధంగా మన తెలుగు బుల్లితెర రంగంలో కరోనా వైరస్ ప్రభావం ఒక్కసారిగా చెలరేగడం కలకలం రేపింది. పలు టాప్ ఛానెల్స్ కి చెందిన నటులు మరియు దర్శకులకు సహా లీడ్ రోల్స్ చేసే వారికి కూడా కరోనా పాజిటివ్ రావడం తెలుగు స్మాల్ స్క్రీన్ వీక్షకులను ఎంతగానో కలవరపెట్టింది.

అలా కరోనా పాజిటివ్ వచ్చిన నటులలో ఈటీవీ మరియు స్టార్ మా ఛానెల్ సీరియల్స్ లో నటిస్తున్న సీరియల్ హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ రావడం ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఈ విషయం పై నవ్య స్పందించినట్టు తెలుస్తుంది. తనకి కరోనా సోకిందని తెలిసి వార్త బయటకు వచ్చాక చాలా డిప్రెషన్ కు లోనయ్యా అని..

ఈ వార్త బయటకు రాగానే తనకి వాట్సాప్ మెసేజ్ లు ఫోన్ కాల్స్ వచ్చాయని ఇవన్నీ తట్టుకోలేక తన తల్లితో మాట్లాడి ఏడ్చేశానని ఆమె తెలిపారు. అంతే కాకుండా అనవసరంగా తన కో యాక్టర్స్ ప్రాణాలను కూడా పణంగా పెట్టానేమో అన్న మరో గిల్టీ ఫీలింగ్ తనను మరింత కలచివేసింది అని అని నవ్య తెలిపినట్టు తెలుస్తుంది.