మహేష్ టీఆర్పీ ఎలా వచ్చిందో ఇప్పుడు తేలిపోద్ది.!

Friday, April 3rd, 2020, 01:45:05 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మహేష్ మరియు మాస్ ఆడియెన్స్ ను ఈ చిత్రం మెప్పించింది. అయితే ఈ చిత్రం తాజాగా జెమినీ టీవిలో ఉగాది కానుకగా టెలికాస్ట్ చెయ్యగా మన తెలుగులోనే కనీ వినీ ఎరుగని స్థాయి టీఆర్పీ రికార్డులను నమోదు చేసింది.

అయితే ఈ టీఆర్పీ పై ఇప్పుడు బాగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భారీ టీఆర్పీ క్రెడిట్ ను మహేష్ ఫ్యాన్స్ పూర్తిగా మహేష్ ఖాతాలో వేసేస్తుండగా ఇతర హీరోల అభిమానులు మాత్రం అంత సీన్ అయితే లేదని ఇది అంతా లాక్ డౌన్ ఎఫెక్ట్ అని అంటున్నారు. అయితే వీరు అన్నదాంట్లో వాస్తవం కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాక్ డౌన్ కారణంగా ఈ మధ్య టెలికాస్ట్ అయిన సినిమాలకు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

అలాంటి సాయి ధరమ్ తేజ్ సినిమాకే 15కు పైగా వచ్చింది. దీనితో కొన్ని అనుమానాలు తప్పవు. అయితే అసలు ఇదంతా మహేష్ స్టామినానా? లేక లాక్ డౌన్ ఎఫెక్టా అన్నది ఇప్పుడు అదే జెమినీ ఛానెల్లో రాబోతున్న “దర్బార్” టీఆర్పీను బట్టి తేలిపోతుంది అని చెప్పాలి. మహేష్ సినిమాను దాటడం కష్టమే కానీ ఊహించిన దానికంటే ఎక్కువ వస్తే మహేష్ సినిమాకు మాత్రం లాక్ డౌన్ ఖచ్చితంగా ప్లస్ అయ్యిందని చెప్పక తప్పదు.