సమంత నటించిన ఆ థ్రిల్లింగ్ సిరీస్ అప్పుడే ఎండ్ కాదట.!

Tuesday, June 2nd, 2020, 03:16:54 PM IST

ఈరోజుల్లో డిజిటల్ యాప్స్ ఏ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ వీక్షకుల్లో నాటుకుపోయాయో అందరికీ తెలుసు. కేవలం ఈ డిజిటల్ యాప్స్ అంటే కొత్త సినిమాలే కాకుండా వాటినే తలదన్నే వెబ్ సిరీస్ లు కూడా అని చెప్పాలి. దీనితో ఈ వెబ్ సిరీస్ లలో నటించేందుకు స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు సైతం రెడీ అవుతున్నారు.

అలా అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సెన్సేషనల్ వెబ్ సిరీస్ లలో “ది ఫ్యామిలి మ్యాన్” కూడా ఒకటి. ఆధ్యంతం థ్రిల్లింగ్ గా కొనసాగే ఈ వెబ్ సిరీస్ ఒక సీజన్ ను పూర్తి చేసుకుంది. దీనితో ఇప్పుడు నెటిజన్స్ రెండో సీజన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

సమంత తో పాటు ప్రియమణి కూడా ఇందులో ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ రెండో సీజన్ తో ఎండ్ కాదట మూడో సీజన్ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. వెబ్ సిరీస్ లవర్స్ దీని కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీజన్ ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి.