సాహో చిత్రానికి వచ్చిన టీఆర్పీ చూసి షాక్ అవుతున్న అభిమానులు

Thursday, October 29th, 2020, 11:07:52 PM IST


యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత వచ్చిన సినిమా కావడం తో విడుదలకి ముందు ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే తెలుగు లో నిరాశ పరిచిన ఈ చిత్రం, బాలీవుడ్ లో కనక వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టీవీ లో టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి వచ్చిన టీఆర్పీ చూసి అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ఈ చిత్రం 5.8 టీఆర్పీ ను సాధించడం పట్ల సదరు యాజమాన్యం సైతం షాక్ కి గురి అయినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజున వేరే ఛానెల్ లో టెలికాస్ట్ అయిన గుణ 369 చిత్రం 5.9 టీఆర్పీ ను సాధించడం జరిగింది. అయితే సా హో చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ బుల్లితెర పై కూడా తన సత్తాను చాటలేకపోవడం తో అభిమానులు మరోమారు దీని పై చర్చలు జరుపుతున్నారు అని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో పాటుగా మరో రెండు చిత్రాలకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.