“సాహో” కు అక్కడ చప్పుడు లేదా..?

Friday, February 14th, 2020, 10:30:01 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. గ్రహాలు అనుకూలించక సినిమా ప్లాప్ అయ్యిపోయింది కానీ హిట్టయ్యి కానీ ఉంటే మరో బాహుబలిని తలపించి ఉండేది అని డార్లింగ్ అభిమానులు అంటుంటారు.పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల కాబడిన ఈ చిత్రం ఒక్క హిందీలో తప్ప మరెక్కడా కూడా అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు.దీనితో అన్ని భాషల్లోకల్లా ఈ చిత్రం ఒక్క బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

బాహుబలి ఇచ్చిన ఇంపాక్ట్ దెబ్బకు హిందీ జనం ప్రభాస్ ను ఓన్ చేసుకున్నారు.అలా సినిమా విడుదల కాబడిన కొన్ని నెలలకే జీ సినిమా వారు హిందీ వెర్షన్ ను జనవరి 26 ఆ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసారు.దీనికి ముందు భారీ స్థాయిలోనే ప్రమోట్ చేసారు కానీ అయినప్పటికీ సాహో కు అనుకున్న స్థాయి టీఆర్పీ రేటింగ్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ పడలేనట్టు తెలుస్తుంది.సినిమాను టెలికాస్ట్ చేసిన ఒక్క వారంలోనే మరోసారి కూడా టెలికాస్ట్ చేసేసారు.ఇప్పటికి కూడా టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎక్కడా చప్పుడు లేదు.దీనితో సాహో హిందీ వెర్షన్ కు ఊహించిన రీతిలో రెస్పాన్స్ వచ్చి ఉండదు అని టాక్ వినిపిస్తుంది.