వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “సాహో”

Sunday, October 11th, 2020, 01:21:33 PM IST

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ మరియు బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కలిసి నటించిన సాహో చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. జీ టీవీ తెలుగు లో అక్టోబర్ 18 గా తారీఖున సాయంత్రం 4:30 గంటలకు ప్రసారం కానుంది. ప్రభాస్ హీరోగా బాహుబలి సిరీస్ ల తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం మొదటి సారి గా బుల్లితెరపై అలరించడానికి సిద్దం గా ఉంది.

ప్రభాస్ బాహుబలి చిత్రం తో పాన్ ఇండియన్ స్టార్ హీరో గా ఎదిగిన అనంతరం సాహో చిత్రం బాలీవుడ్ లో సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ ను షేక్ చేయడం మాత్రమే కాకుండా బాలీవుడ్ లో లాభాల బాట కూడా పట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 మాత్రమే కాకుండా ఆది పురుష్ లాంటి భార్ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు.