హిందీలో అదరగొడుతున్న “రౌద్రం రణం రుధిరం”

Thursday, March 26th, 2020, 10:58:41 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” మోషన్ పోస్టర్ మరియు దానికి సంబంధించిన టీజర్ ను కూడా నిన్ననే విడుదల చేసారు. బాహుబలి తర్వాత మళ్ళీ భారీ పాన్ ఇండియన్ చిత్రంగా ప్లాన్ చేసిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మోషన్ పోస్టర్ తాలూకా టీజర్లు వచ్చాయి.

అయితే హిందీలో “రైజ్ రోర్ రివోల్ట్” గా నిన్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో అదరగొడుతుంది. మన తెలుగు వీడియోకే రికార్డు స్థాయి మిలియన్ వ్యూస్ మరియు లైక్స్ వచ్చినప్పటికీ హిందీలో విడుదల చేసిన వీడియోనే ఆల్ ఇండియా నెంబర్ 1 ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఈ మోషన్ పోస్టర్ టీజర్ 3.3 మిలియన్ వ్యూస్ మరియు ఒక లక్ష 94 వేలకు పైగా లైక్స్ ను రాబట్టుకుంది.