“రంగస్థలం” టైప్ టాక్ తెచ్చుకున్న చిత్రం ప్రైమ్ లో.!

Sunday, April 5th, 2020, 10:12:38 AM IST

మన టాలీవుడ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంతా హీరోయిన్ వైవిధ్య దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన “రంగస్థలం” చిత్రం తెలుగు ఆడియెన్స్ ను ఎలా ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా మన తెలుగు ఆడియెన్స్ కు ఇంతలా ఎక్కడానికి కారణం ఈ సినిమాను అత్యంత సహజత్వంగా ఉండడం. అలాగే ఈ మధ్యనే మన టాలీవుడ్ లో విడుదల కాబడిన ఓ చిన్న సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అదే రక్షిత్ హీరోగా నక్షత్ర హీరోయిన్ గా కరుణా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “పలాస 1978”. రఘు కుంచె సంగీతం అందించిన ఈ చిత్రం రంగస్థలం తరహా టాక్ ను తెచ్చుకొని చూసిన కొద్ది మంది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ లాక్ డౌన్ సమయం దీనిని అప్పుడు మిస్సయినవారు ఇప్పుడు ఒక లుక్కెయ్యండి.