మన ఛానెల్స్ లో “మెగాపవర్ స్టార్” బర్త్ డే స్పెషల్ సినిమాలు ఇవే!

Friday, March 27th, 2020, 10:03:42 AM IST

ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ బాక్సాఫీస్ మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులు సోషల్ మీడియాలో పండుగలా జరుపుకుంటున్నారు.అయితే వారందరికీ మరింత ఆనందం ఇచ్చేలా ఈరోజు మన తెలుగు ఛానెల్స్ కూడా మెగాపవర్ సినిమాలతో ఈరోజు మొత్తం వారికి రామ్ చరణ్ సినిమాలతో నింపేశారు.

మొదటగా స్టార్ మా లో ఉదయం ఎనిమిదిన్నరకు తన కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ “మగధీర”తో షో స్తార్ట్ చేసి 10 గంటలకు జెమినీ మూవీస్ లో “తుఫాన్” మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా మూవీస్ లో రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ ల కలయికలో వచ్చిన “ఎవడు”, మళ్ళీ అదే ఛానెల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీ “ఆరెంజ్” అలాగే సాయంత్రం 6 గంటలకు అయి సినిమాలు ఛానెల్లో ఎంటర్టైనర్ “బ్రుస్ లీ” సినిమాలో లాస్ట్ షో ను మన తెలుగు ఛానెల్స్ వారు ప్లాన్ చేసారు.మొత్తానికి ఈరోజు మాత్రం మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఆఫ్ లైన్ పండుగ లేకపోయినా ఆన్లైన్ లో మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.