రెబల్ స్టార్ సినిమాకు ఆ భాగ్యం లేదా.?

Friday, April 3rd, 2020, 12:32:13 PM IST

మన టాలీవుడ్ నుంచి మామూలు హీరోగా మొదలయ్యి ఇప్పుడు భారతదేశ సినిమానే శాసించే ఏకైక తెలుగు హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారిపోయాడు.బాహుబలి తర్వాత డార్లింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ రెండు చిత్రాల తర్వాత టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తో “సాహో” అనే భారీ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా తియ్యగా దానికి టాక్ బాగోకపోయినప్పటికీ భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. అయితే ఈ చిత్రం తర్వాత మన స్టార్ హీరోల సినిమాలు ఎన్నో వచ్చేసాయి టీవీల్లో కూడా ప్రసారం కూడా అయ్యిపోయాయి.

కానీ సాహో విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ చిత్రాన్ని అప్పుడెప్పుడో జెమినీ టీవీ సొంతం చేసుకున్నారని వార్తలొచ్చాయి.కానీ దీని టెలికాస్ట్ డేట్ కానీ అందుకు సంబంధించిన సమాచారం కాలం లేదు. ఈ చిత్రాన్ని ఏ ఛానెల్ వారు సొంతం చేసుకున్నప్పటికీ మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి గుర్తింపు ఉంది ఎలాగో ఇది మంచి టైం కాబట్టి ఏ ఛానెల్ లో టెలికాస్ట్ చేసినా తప్పకుండా భారీ టీఆర్పీ నెలకొల్పడం ఖాయం అని చెప్పాలి.