“నాగశౌర్య” సస్పెన్స్ థ్రిల్లర్ కు స్ట్రీమింగ్ డేట్!

Wednesday, March 25th, 2020, 05:44:50 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “అశ్వథ్థామ”. క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ జానర్ తరహా చిత్రాలను ఇష్టపడే వారికి మంచి అనుభూతిని అందించింది.

నాగశౌర్య ఎంతో ఇష్టపడి రాసుకున్న ఈ చిత్రం మంచి టాక్ ను సంతరించుకున్న బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా మాత్రం హిట్ అనిపించుకోలేకపోయింది. ఈ చిత్రంలో విలన్ రోల్ లో కనిపించిన జిషు సేన్ అయితే టాలీవుడ్ కు ఒక కొత్త తరహా విలన్ రోల్ ను అందించాడు.

ఇప్పుడు ఇలాంటి సినిమా డిజిటల్ గా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన “డిస్కో రాజా” ఈరోజు సన్ నెస్ట్న్ లో అందుబాటులోకి వచ్చింది ఇదే సన్ నెక్స్ట్ లో వచ్చే మార్చ్ 27న నాగశౌర్య నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.ఒకవేళ ఈ చిత్రం థియేటర్ లో మిస్సయితే ఇప్పుడు చూసేయ్యండి.