ఈసారి బిగ్ బాస్ షోలో నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే.?

Saturday, August 1st, 2020, 02:13:29 PM IST

కేవలం సిల్వర్ స్క్రీన్ మీదనే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అదరగొట్టారు. సినిమాల పరంగా వీక్ గా ఉన్న స్టేజి లో స్మాల్ స్క్రీన్ పైకి “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే షో ద్వారా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ఆ షో ద్వారా స్మాల్ స్క్రీన్ పై తిరుగు లేని ఇమేజ్ ను తెచ్చుకున్న కింగ్ నాగార్జున ఆ తర్వాత సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 4 తో మరోసారి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో నాగ్ కనిపించిన మూడో సీజన్ కే భారీ స్థాయి టీఆర్పీ వచ్చిందంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈసారి మళ్ళీ నాగార్జునే కనిపించడం ఖరారు అయ్యింది. అయితే గత సీజన్లో ఒక్కో ఎపిసోడ్ కు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న నాగార్జున ఈసారి సీజన్ కు ఛార్జ్ పెంచినట్టు తెలుస్తుంది. ఈసారి సీజన్ కు గాను నాగార్జున 14 నుంచి 15 లక్షలు ఒక్కో ఎపిసోడ్ కు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సీజన్ ను కేవలం 70 రోజులకే పరిమితం చేసేలా స్టార్ మా యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.