మెగాహీరో సాంగ్ కు 100 మిలియన్..!

Thursday, August 6th, 2020, 09:02:40 AM IST

మన టాలీవుడ్ లోకి మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తో “శంకర్ దాదా ఎంబీబీస్” సినిమాలో నటించి మెప్పించిన ఈ నటుడు ఇప్పుడు హీరోగా పరిచయం అయ్యేందుకు రెడి అయ్యాడు.

అయితే తాను హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం “ఉప్పెన” విడుదలకు ముందే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యిందని చెప్పాలి. మ్యూజికల్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీలు ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళాయి.

మొదటగా విడుదల చేసిన “నీ కన్ను నీలి సముద్రం” సాంగ్ అయితే చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకొని ఈ డెబ్యూ హీరోకు సంచలన రికార్డును అందించింది. ఈ సినిమా కరోనా పరిస్థితులు చక్కబడ్డాక నేరుగా థియేటర్స్ లో విడుదల కానుంది.