మహేష్ ఖాతాలో పడబోతున్న ఈ అరుదైన హిస్టారిక్ రికార్డు.!

Friday, February 14th, 2020, 02:50:37 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు.చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అటు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ నుంచి ఇటు యూత్ లో ఫాలోయింగ్ వరకు అన్ని వర్గాల్లో మహేష్ కు అత్యంత పాపులారిటీ ఉంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో అయితే మరింత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు.అలా మహేష్ తీసిన పలు చిత్రాల్లో తన అభిమానులకే కొన్ని సోసో గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ వాటని బ్లాక్ బస్టర్స్ గా మలచారు.

అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి ఒక్క మహేష్ ఖాతాలోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పే దిశగా వెళ్తుంది.దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “శ్రీమంతుడు” ఇప్పుడు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దిశగా కొనసాగుతుంది.ఒక స్ట్రయిట్ తెలుగు భాష సినిమా 100 మిలియన్ల మార్కును అందుకోబోతుండడం ఆశామాషి వ్యవహారం అయితే కాదని చెప్పాలి.

మాములుగా అయితే హిందీ డబ్బుడ్ తెలుగు చిత్రాలు వందల మిలియన్ వ్యూస్ అనుకుంటాయి.కానీ ఒక్క తెలుగు భాషలోనే 91 మిలియన్ వ్యూస్ కు పైగా తెచ్చుకోడం నిజంగా ఆశ్చర్యకరమే అని చెప్పాలి.2017 సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటికి 9 కోట్ల 10 లక్షలకు పైగా వచ్చాయి.ఇప్పటి వరకు మన తెలుగులో ఏ చిత్రానికి కూడా ఇన్ని వ్యూస్ రావడం జరగలేదు.మరి ఈ 100 మిలియన్ మార్కును ఈ చిత్రం ఎప్పటికి అందుకుంటుందో చూడాలి.