ఫస్ట్ బేబీని చాలా మిస్ అవుతున్నా – లాస్య

Friday, November 6th, 2020, 11:05:15 AM IST

బిగ్ బాస్ రియాలిటీ షో తో టాలెంట్ ఉన్న వివిధ రంగాలకు చెందిన వారు ఇంకాస్త వెలుగులోకి వస్తారు. అయితే తన మెస్మరైజింగ్ యాంకరింగ్ తో అందరినీ మెప్పించిన లాస్య కూడా ఈ సీజన్ బిగ్ బాస్ లో ఉన్న సంగతి తెలిసిందే. చలాకీగా, హుషారుగా ఉండే లాస్య తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ను బిగ్ బాస్ వేదిక గా పంచుకుంది.

అయితే లాస్య తన మొదటి బిడ్డను చంపుకున్న విషయాన్ని బయటపెట్టింది. అందుకు సంబంధించిన సంఘటన గురించి తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అయింది. 2010 లో పెళ్లి అయినప్పటికీ కూడా 2012 నుండి కలిసి ఉంటున్నాం అని, ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నం చేసినట్లు వివరించారు. అయితే 2014 లో తన నాన్న ఫోన్ చేసి మాట్లాడిన విషయం ను వెల్లడించారు. మీరు పెళ్లి చేసుకున్న విషయం మన కుటుంబాల్లో ఎవరికి తెలీదు అ ని, నేను ఎవరికీ చెప్పలేదు, నువ్వు ఎవరికి చెప్పకు, సెటిల్ అయ్యాక తానే పెళ్లి చేస్తా అని అన్నారు అని వివరించారు.

అయితే ఒకరోజు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నన్సీ అని చెప్పారు అని, ఈ విషయం పేరెంట్స్ కి చెప్పలేక కడుపు తీయించుకున్న విషయాన్ని వెల్లడించారు. అయితే 2014 లో ఇది జరగగా, తనకు 2017 లో వివాహం అయింది అని అన్నారు. పెళ్ళైన 5 నెలలకు ప్రెగ్నెన్సీ అయింది అని, మూడు నెలల తర్వాత మిస్ క్యారీ అయింది అని, మళ్ళీ పెగ్నేన్సీ రాదేమో అని భయపడ్డ విషయాన్ని తెలిపారు. అయితే 2014 లో చెక్ చేయించుకున్న ఆ ఫైల్ తన వద్ద ఉందని, ఫస్ట్ బెబీ ను బాగా మిస్ అవుతున్నా అని అన్నారు. 2018 లో జున్నుగాడు వచ్చాడు అని, జున్నుగాడి విషయంలో ఆ పని చేయలేదు అని, వాడు వచ్చాక తన జీవితం పూర్తిగా మారిపోయింది అంటూ లాస్య భావోద్వేగం అయ్యారు.