అదరగొట్టిన “జబర్దస్త్” షోల టీఆర్పీ.!

Thursday, April 2nd, 2020, 03:22:58 PM IST


తెలుగు ఆడియెన్స్ ఎక్కడ ఉన్నా సరే నవ్వుల్లో నాన్ స్టాప్ గా ముంచెత్తే ఏకైక షో ఏదన్నా ఉంది అంటే అది “జబర్దస్త్” అని చెప్పాలి. ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ షో ఊహలకు అందని హిట్టయ్యి “ఎక్స్ట్రా జబర్దస్త్”గా మారి కూడా ప్రతీ గురువారం మరియు శుక్ర వారం రోజుల్లో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి.

మామూలుగానే ఈ రెండు షోలకు మైండ్ బ్లోయింగ్ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి.అలా ఈసారి అంతకు మించిన రేటింగ్ వచ్చింది. గత మార్చ్ 26 మరియు 26 గురు,శుక్రవారాలు ప్రసారం అయిన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు వరుసగా 10 మరియు 11 భారీ టీఆర్పీ (CSF 15+ABC) రేటింగ్ పాయింట్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

మొత్తానికి మాత్రం గత వారం ఈటీవీ అన్ని షోలు టీఆర్పీ వార్ ను వన్ సైడ్ చేసేసేలా ఉన్నాయని చెప్పాలి. మరి అదే వారంలో ఉగాదికి ప్లాన్ చేసిన స్పెషల్ ఈవెంట్ “పండగ సార్ పండగ అంతే” కు ఎంత టీఆర్పీ వచ్చి ఉంటుందో చూడాలి.