వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా కార్తీ లేటెస్ట్ సినిమా..!

Friday, August 7th, 2020, 01:06:06 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు అక్కడితో పాటు మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి తనకంటూ కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న మరో హీరో కార్తీ. కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా మన టాలీవుడ్ లో కూడా ప్రత్యేక ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు.

అలా అన్ని సినిమాలు కూడా తెలుగులో కూడా రీలీజ్ చేసుకున్నాడు. కొన్నాళ్ల వరకు ఎలాంటి హిట్ లేని సమయంలో “ఖైదీ” అనే సినిమాతో ఒక సాలీడ్ కంబ్యాక్ ను అందుకున్నాడు. ఇక అలాగే ట్రాక్ లోకి వచ్చాడు అనుకునే లోపే మరో సినిమాను కూడా మన దగ్గర దింపేసాడు.

అదే తాను హీరోగా జ్యోతిక ఒక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “దొంగ” ఇటీవలే జీ 5 లో డిజిటల్ ప్రీమియర్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విడుదలయ్యేందుకు రెడి అవుతుంది. జీ తెలుగులో ఈ చిత్రాన్ని అతి త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చూడాలి.