మరోసారి హాట్ టాపిక్ అవుతున్న “ఇస్మార్ట్ శంకర్”.!

Friday, February 14th, 2020, 09:00:51 AM IST

దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ల కాంబోలో తెరకెక్కిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఎంత స్థాయి హిట్టయ్యిందో అందరికీ తెలుసు.అలాగే ఈ చిత్రం ఒక్క టాలీవుడ్ ప్రేక్షకుల్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకుల్లో కూడా మంచి హాట్ టాపిక్ అయ్యింది.దీనిథి ఇస్మార్ట్ శంకర్ మ్యానియా బాలీవుడ్ లో కూడా మొదలయ్యింది.

దీనితో ఈ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కూడా చెయ్యబోతున్నారు.అందులో భాగంగా ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యబోతున్న సోనీ మాక్స్ చానెల్ వారు ఈ చిత్రానికి హిందీలో గట్టిగానే ప్రమోషన్ చేస్తుండగా సోషల్ మీడియాలో మరోసారి ఈ సినిమా మంచి హాట్ టాపిక్ అవుతుంది.ఈ ఫిబ్రవరి 16న రాత్రి 8 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సెట్ మాక్స్ ఛానెల్లో ప్రసారం అయ్యి భారీ టీఆర్పీ రికార్డులు కొడుతుంది అంటూ సోషల్ మీడియాలో రామ్ ఫాలోవర్స్ అంటున్నారు.అంతే కాకుండా హిందీ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాపై మంచి హైప్ కూడా ఉంది.మరి ఈ చిత్రం ఏపాటి టీఆర్పీ రేటింగ్స్ ను సాధిస్తుందో చూడాలి.