నటిగానే కాకుండా హోస్ట్ గా అదరగొట్టిన సమంత…భారీ టీఆర్పీ వచ్చేసిందిగా!

Thursday, November 5th, 2020, 03:00:47 PM IST

బుల్లితెర బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నాగార్జున రెండో సారి హోస్ట్ గా చేస్తూ అందరినీ అలరిస్తున్నారు. అయితే వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్ నిమిత్తం నాగ్ మనాలి వెళ్లాల్సి ఉండటం తో కోడలు, అక్కినేని సమంత హోస్ట్ గా బాధ్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ ఇచ్చిన అవకాశాన్ని సమంత చక్కగా సద్వినియోగం చేసుకున్నారు అని చెప్పాలి.

అయితే దసరా పండుగ రోజున భారీ ఎపిసొడ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసొడ్ కి గారు 11.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే ఇంత భారీ టీఆర్పీ రావడం తో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత నటిగా అద్భుతంగా రాణిస్తూ నే ఉన్న, హోస్ట్ గా కూడా అదరగొట్టడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత హోస్టింగ్ కి అటూ బిగ్ బాస్ సభ్యులు, ఇటు ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ అయ్యారు. ఇప్పటికే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా వస్తున్న సిరీస్ లో సమంత నటిస్తుండగా, పలు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.