ఐదేళ్ల కితం నాని సినిమా ఇప్పుడు టీవీలో..!

Friday, July 31st, 2020, 12:16:03 PM IST

లాక్ డౌన్ సమయంలో ఏకైక ఎంటర్టైనింగ్ మాధ్యమంగా టెలివిజన్ రంగం ఎలాంటి పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. సీరియల్స్ ఏమీ లేకపోవడంతో ఎక్కువగా సినిమాలపైనే ఆధార పడ్డాయి. ముఖ్యంగా మన తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా మాత్రం అవి ఇవి అని లేకుండా మన వాళ్ళు ఇప్పటి వరకు మిస్సయిన అన్ని భాషల సినిమాలను ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యలో అయితే కొన్నాళ్ల పాటు టెలికాస్ట్ చెయ్యని చిత్రాలను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యడానికి వస్తున్నారు.

అలా ఇప్పుడు మరో పాత సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు. నాచురల్ స్టార్ నాని హీరోగా అమలాపాల్ హీరోయిన్ గా గత ఐదేళ్ల కితం నటించిన చిత్రం “జెండాపై కపిరాజు” ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఇవ్వనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. మొదటి సారి డ్యూయల్ రోల్ చేశారు. కానీ అప్పుడు పలుమార్లు డిలే అవ్వడంతో థియేటర్స్ లో కూడా అంతగా ఆడలేదు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి