ముగింపుకు వచ్చిన ఈ బ్రిలియంట్ వెబ్ సిరీస్.!

Saturday, August 1st, 2020, 04:17:31 PM IST

ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందిన స్ట్రీమింగ్ వరల్డ్ లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలు ఎన్నెన్నో ఉన్నాయి. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంటర్టైనింగ్ రంగాన్ని ఇవే శాసిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా దెబ్బకు మాత్రం వీరికి భారీ లాభాలు చేకూరాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ చాలానే అదిరిపోయే వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అలాంటి వాటిలో అతి కీలకమైన మరియు ఫేమస్ వెబ్ సిరీస్ “మనీ హేస్ట్”.

ఈ బ్రిలియంట్ వెబ్ సిరీస్ కు మన తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సిరీస్ తాలూకా నాలుగో సీజన్ భారీ వ్యూవర్ షిప్స్ తో రికార్డు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ కు ఒక ముగింపు వస్తున్నట్టు తెలుస్తుంది. స్ట్రీమింగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 5 తో ముగియనుందట. ఈ వార్త కూడా అధికారికంగానే బయటకు వచ్చింది. దీనితో ఈ సిరీస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు కానీ తప్పదు అని సర్ది చెప్పుకుంటున్నారు.