హిందీ “కాంచన”కు హాట్ స్టార్ ఇంత ఆఫర్ చేసిందా..?

Friday, July 3rd, 2020, 05:02:53 PM IST

సినీ రంగంలో అన్ని కలలు తెలిసిన అతి తక్కువమంది ఫిల్మ్ మేకర్స్ లో రాఘవ లారెన్స్ కూడా ఒకరు. డాన్సర్, కొరియోగ్రాఫర్ గానే కాకుండా హీరోగా డైరెక్టర్ గా కూడా లారెన్స్ తెలుగు మరియు తమిళ్ ఇండస్ట్రీ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. అయితే లారెన్స్ డాన్సర్ అయినప్పటికీ ఎక్కువగా చేసేది మాత్రం డాన్ మరియు హార్రర్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించారు.

అలా తీసిన చిత్రాల్లో సూపర్ హిట్ అయిన హార్రర్ సిరీస్ “ముని” ఇందులో ముని 2 ను “కాంచన” గా ఒక వైవిధ్యమైన సబ్జెక్ట్ తో తీయడంతో అనేక ప్రశంసలు కూడా వచ్చాయి. దీనితో ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. కానీ బాలీవుడ్ లో మాత్రం “లక్ష్మి బాంబ్” గా రీసెంట్ గానే రీమేక్ అయ్యింది. అక్కడి స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం కరోనా వల్ల థియేటర్స్ లో ఆగిపోయింది. కానీ డిజిటల్ ప్రీమియర్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కు రానుంది.

అయితే ఈ చిత్రానికి హాట్ స్టార్ వారు భారీ ఆఫర్ ను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీడియం బడ్జెట్ తో 50 కోట్లు లోపే పూర్తి కాబడిన ఈ చిత్రానికి 100 కోట్లకు పైగానే ఆఫర్ చేశారట. ఇది నిజంగానే ఒక భారీ ఫాన్సీ రేటు అని చెప్పాలి. అయితే ఈ సినిమాకు అక్షయ్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో తీసుకుంటారని తెలుస్తుంది.