2.6 కోట్ల వ్యూస్ కొల్లగొట్టిన “ఢీ ఛాంపియన్స్” ఎపిసోడ్ ను మిస్సవ్వకండి.!

Wednesday, August 5th, 2020, 03:10:28 PM IST

మన దక్షిణాది టెలివిజన్ హిస్టరీ లోనే ఒక డాన్స్ రియాలిటీ షో వరుసగా 12 సీజన్లు నడవడం అనేది చాలా అరుదైన అంశం కానీ ఆ మాటను సాధ్యం చేసిన ఏకైక తెలుగు ఛానెల్ ఈటీవీ. 11 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు 12వ సీజన్ ను టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ తో కొనసాగిస్తోంది. స్టేజ్ దద్దరిల్లే డాన్స్ స్టెప్పులు కడుపుబ్బా నవ్వే ఎంటర్టైన్మెంట్ తో కొనసాగే ఈ షోకు సంబంధించి ఈరోజు ఆగస్ట్ 5 ఎపిసోడ్ ను మాత్రం మిస్సవ్వకూడదని చెప్పాలి.

ఈ పర్టికులర్ రోజున టెలికాస్ట్ అవ్వనున్న ఎపిసోడ్ తాలూకా ప్రోమో కనీ వినీ ఎరుగని రేంజ్ లో 25 మిలియన్ వ్యూస్ అందుకొని రికార్డ్ సెట్ చేసింది ఇది ఒక్క ఢీ ప్రోమోల హిస్టరీ లోనే కాకుండా ఏ ఇతర తెలుగు ఎంటర్టైనింగ్ ఛానెల్స్ ప్రోమోలలో కూడా లేదు. “మల్లెమాల” యూట్యూబ్ చానెల్లో 12.91 మిలియన్ వ్యూస్ మరియు 2 లక్షల 10 వేలకు పైగా లైక్స్ అలాగే “ఈటీవీ ఢీ” యూట్యూబ్ ఛానెల్లో 12.99 మిలియన్ వ్యూస్ మరియు 2 లక్షలకు పైగా లైక్స్ మరియు ఇంకా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ మొత్తం మూడు కోట్ల వరకు వ్యూస్ ను కొల్లగొట్టాయి.

ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో పండు పెరఫార్మన్స్ మెయిన్ హైలైట్ గా నిలవనుంది అలాగే సోము చేసిన ఎమోషనల్ పెరఫార్మన్స్ మరియు సుధీర్ అండ్ రష్మిల మధ్య చేసిన బుట్ట బొమ్మ సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి యూట్యూబ్ లో ఇంత రచ్చ లేపిన ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ హైలైట్ అంశాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా ఉండనున్నాయో తెలియాలి అంటే ఈ రోజు ఈ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.