మరో అదిరిపోయే హాలీవుడ్ సినిమాతో ఈటీవీ.!

Sunday, August 9th, 2020, 06:31:43 PM IST

మన తెలుగులో ఉన్నటువంటి టాప్ తెలుగు ఛానెల్స్ లో ఈటీవీ తెలుగు ఛానెల్ కూడా ఒకటి. ఎన్నో అదిరిపోయే ఎంటర్టైనింగ్ షోలను అందివ్వడంలో ఈటీవీ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అయితే ఢీ, జబర్దస్త్ మరియు క్యాష్ లాంటి ఎంటర్టైనింగ్ షోలను అందించే ఈటీవీ సీరియల్స్ తో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకుంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈటీవీ వెనుకబడి ఉంటుందని చెప్పాలి.

అదే సినిమాల విషయంలో. ఏ కొత్త సినిమాలను కూడా ఈటీవీ నుంచి ఆశించలేం. ఏదో అందరికీ బాగా నచ్చిన చిన్న సినిమాలను ఈటీవీ వారు అరకొరగా తీసుకుంటారు. ఇక వాటిని పక్కన పెడితే ఇప్పుడు ఊహించని విధంగా హాలీవుడ్ సినిమాలను ఈటీవీ వారు టెలికాస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. అలా గత ఆదివారం హాలీవుడ్ హంక్ ఆర్నాల్డ్ నటించిన భారీ యాక్షన్ మూవీ టెర్మినేటర్ రైజ్ ఆఫ్ ది మెషీన్స్ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యగా..

ఈ రాబోయే ఆదివారం మరో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ నటించిన సూపర్ హీరో చిత్రం “హేంకాక్” ను టెలికాస్ట్ చెయ్యనున్నారు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఈ చిత్రం ఈటీవీలో టెలికాస్ట్ కానుంది. ఓ మంచి హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ని చూడాలి అనుకుంటే ఈ చిత్రం మీకు సూపర్ ఛాయిస్ అవుతుంది డోంట్ మిస్.