ఈరోజు ఈటీవీలో ఈ సినిమాను మిస్సవ్వద్దు.!

Friday, May 22nd, 2020, 09:59:35 AM IST


మన తెలుగులో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించడంలో ఈటీవీ ఛానెల్ ఎప్పుడు ముందే ఉంటుంది. ఇతర ఛానెల్స్ తో పోలిస్తే ప్రోగ్రామ్స్ కానీ సీరియల్స్ ద్వారా కానీ ఎల్లప్పుడూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రజలకు ఈ ఛానెల్ ద్వారా వస్తుంది. పైగా ఎలాంటి కొత్త సినిమాలు టెలికాస్ట్ చేయకున్నా సరే. కానీ వారి స్వీయ నిర్మాణంలో వచ్చినవి మాత్రం ఈ ఛానెల్లో టెలికాస్ట్ అవుతుంటాయి.

అయితే ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ తెలుగు సినిమా ఈ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. అదే సూపర్ స్టార్ మహేష్ కు బావమరిది సుధీర్ బాబు హీరోగా అదితిరావు హైదరి హీరోయిన్ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సమ్మోహనం”. 2018 చివర్లో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

అయితే అనుకున్నంత స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది కానీ ఈ చిత్రాన్ని చూసిన వారికి మాత్రం ఒక ఫీల్ గుడ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇవ్వగలిగింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ రోజు ఈటీవీ ఛానెల్లో సాయంత్రం6 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చేయనున్నారు. ఒకవేళ అప్పుడు ఈ ఫీల్ గుడ్ చిత్రాన్ని మిస్ అయ్యినట్టైతే మీ ఈటీవీలో ఈరోజు మిస్సవ్వకుండా చూసేయ్యండి.