యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న పండు పెర్ఫామెన్స్.!

Saturday, August 8th, 2020, 02:09:04 PM IST

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఢీ డాన్స్ ప్రోగ్రాం కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 11 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు 12వ సీజన్లో దూసుకుపోతుంది. అయితే కరోనా వల్ల మధ్యలో కొన్నాళ్ల పాటు షూటింగు ఆగిపోయినా సరే మళ్ళీ మొదలయ్యాక వేరే లెవెల్లో అదరగొడుతుంది అని చెప్పాలి. మోస్ట్ ఎంటర్టైనింగ్ డాన్స్ పెర్ఫామెన్స్ లతో అదరగొడుతున్నారు.

అయితే గత బుధవారం టెలికాస్ట్ కాబడిన ఎపిసోడ్ కు మాత్రం ఎక్కడ లేని హైప్ వచ్చింది. దానికి కారణం పండు చేసిన ఎక్స్ట్రార్డినరీ పెర్ఫామెన్స్ ముఖ్య కారణం అని చెప్పాలి. ప్రోమోలోనే రికార్డు స్థాయి వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పుడు అదే ఫుల్ పెర్ఫామెన్స్ మళ్ళీ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. పండు పెర్ఫామెన్స్ చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో కేవలం రెండు రోజుల్లోనే 9 మిలియన్ వ్యూస్ వరకు కొల్లగొట్టేసి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. అలాగే 1 లక్ష 86 వేలకు పైగా లైక్స్ ను రాబట్టింది.