బిగ్ బాస్ 3 : ఉత్కంఠ వీడింది – విన్నర్ ఎవరో తెలిసిపోయింది…

Sunday, November 3rd, 2019, 11:55:10 PM IST

గత కొద్దీ కాలంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నటువంటి బిగ్ బాస్ మూడవ సీజన్ కి ముగింపు పలికింది. కాగా ఈ సీజన్ కి ఎవరు విన్నర్ అని దాదాపు రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు తీవ్రమైన ఉత్కంఠకు గురయ్యారు. కాగా చివరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో ఈ బిగ్ బాస్ మూడవ సీజన్ విజేత ని ప్రకటించారు కూడా. కాగా అనూహ్యంగా ఫైనల్ కి చేరుకున్నటువంటి ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ బిగ్ బాస్ మూడవ సీజన్ కి విజేత గా రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల చేత ఎన్నుకోబడ్డాడు. కాగా ఈ షో హోస్ట్ నాగార్జున విన్నర్ ని ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి మెడ సీజన్ టైటిల్ ని అందజేశారు. కాగా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు ప్రసరమైనటువంటి ఈ బిగ్ బాస్ ఇంకా ఎన్ని సీజన్ల వరకు వెళ్తుందో చూడాలి.