సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4

Thursday, August 27th, 2020, 11:17:17 PM IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంత గానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ సిరీస్ మళ్లీ మీ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో కి సంబందించిన ప్రోమో విడుదల కాగా, అభిమానులు ఎంతగానో ఆతృత గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ 4 వచ్చే నెల అనగా సెప్టెంబర్ 6, సాయంత్రం ఆరు గంటల నుండి మా టీవీ లో ప్రసారం కానుంది. అయితే బిగ్ బాస్ లో పాల్గొనే కుటుంబ సభ్యులకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఇందులో టీవీ 9 దేవి, డాన్స్ మాస్టర్ రఘు, అతని భార్య ప్రణవి, గంగవ్వ, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, అరియనా, లాస్య, సింగర్ నోయల్, సురేఖ వాణి, కరాటే కళ్యాణి, పూజిత పొన్నాడ, పూనం బజ్వా, అలేఖ్య హారిక, మహబూబ్ దిల్ సే లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయో లేదంటే వీళ్ళే ఫిక్స్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.