“బిగ్ బాస్ 4” టెలికాస్ట్ అప్పటి నుంచే.?

Saturday, August 8th, 2020, 04:36:52 PM IST

మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో నాలుగో సీజన్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత సీజన్లో కనిపించి అదిరిపోయేలా హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున ఈసారి కూడా మళ్ళీ హోస్ట్ కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈసారి మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉండగా చాలా నియమ నిబంధనలతో నాగార్జున ఈ షోలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో నాగార్జున షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీనితో ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుందా అని అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ తెలుగు బిగ్గెస్ట్ సెన్సేషనల్ రియాలిటీ షో ఈ ఆగష్టు చివరి వారం నుంచి టెలికాస్ట్ కానున్నట్టు సమాచారం. అందుకు అనుగుణంగా స్టార్ మా యాజమాన్యం ప్రణాళికలు వేస్తున్నారట. మరి ఈసారి సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.