అరియానా-సోహైల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి గొడవలు పెట్టారుగా..!

Thursday, September 10th, 2020, 12:07:55 PM IST

బిగ్‌బాస్ సీజన్ 4 మూడో రోజు హౌస్‌లో గొడవలు, ఏడుపు రాగాలు, అలకలు ఎక్కువగా కనిపించాయి. ఉదయాన్నే అందరూ డ్యాన్స్‌లతో హోరెత్తించారు. గంగవ్వ కూడా నాలుగు స్టెప్పులు వేసింది. డంబెల్స్ తీసుకుని ఎక్సర్సైజ్ కూడా చేసింది. అభిజిత్, నోయల్ గంగవ్వకు ఎలా ఎక్సర్ సైజ్ చేయాలో నేర్పించారు. ఇదిలా ఉంటే మొన్న సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా-సోహైల్‌లను హౌస్‌లోకి వెళ్లి హౌస్‌మేట్స్‌తో గొడవ పెట్టుకోండి అని రెచ్చగొట్టాడు కదా అనుకున్నట్టుగానే సోహైల్-అరియానా అర్ధరాత్రి సీక్రెట్ రూం నుంచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు అందరిని పలకరిస్తూనే మాకు ఫుడ్ ఎందుకు పంపలేదు అని సభ్యులందరిని నిలదీశారు.

అయితే మా ఫోన్ ఎందుకు కట్ చేశావు అంటూ నోయల్‌తో సోహైల్ గొడవకు దిగాడు. టాస్క్ లో అలానే ఉంటుంది అని నోయల్ దబాయిస్తుండగా మధ్యలో అభిజిత్ కలుగజేసుకుంటూ ఎక్కువ మాట్లాడకు సోహైల్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తరువాత అందరూ నచ్చచెప్పి వారిద్దరిని భోజనం చేయమన్నారు. అయితే సోహైల్ సైలెంట్‌గా భోజనం చేస్తుంటే, అరియానా మాత్రం ఎవరైనా తినిపిస్తేనే తింటాను అంటూ గారం చేసింది. దీంతో అఖిల్ అరియానాకు భోజనం తినిపించాడు. బామ్మకు భోజనం తినిపించావా అఖిల్ అంటూ నోయల్ సరదాగా అడగగా నాకు హ్యుమానిటీ ఉందంటూ అఖిల్ నోయల్‌పై సీరియస్ అయ్యాడు. దీంతో నోయల్ ఏడుపు ముఖం పెట్టి బాధపడ్డాడు. లాస్య మరికొందరు అతడిని సముదాయించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కరాటే కళ్యాణి బయట కూర్చుని ఉండగా దేవి వచ్చి పలకరించింది. కళ్యాణి దురుసుగా మాట్లాడడంతో దేవి కూడా అంతే దురుసుగా వెళ్ళి తలుపు వేసుకుంది. దీంతో కళ్యాణి దొరికిందే ఛాన్స్ అంటూ రాగాలు అందుకుంది. సూర్యకిరణ్ ఓదార్చినా ఆమె వినలేదు. అయితే అరియానా-సోహైల్ లను హౌస్‌లోకి వెళ్ళి గొడవ పెట్టుకోండి అంటే ఇలా అందరి మధ్య గొడవలు పెట్టి కూర్చున్నారు.