ఆకట్టుకుంటున్న “బాపు బొమ్మకు పెళ్ళంట” ప్రోమో

Wednesday, August 12th, 2020, 11:24:47 PM IST

ఇటీవల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొణిదెల నీహారిక, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అయితే తనకు నచ్చిన వ్యక్తి నే పెళ్లి చేసుకోనుంది. అయితే కరోనా కాలం కారణం గా ప్రతీది గ్రాండ్ గా జరుపుకొనే వీలు లేదు. అయితే జీ తెలుగు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది వినాయక చవితి వేడుక నాడు కొణిదెల నీహారిక, నాగబాబు కలిసి రానున్నారు. బాపు బొమ్మకు పెళ్ళంట అంటూ కార్యక్రమం సాగనుంది.

అయితే ఈ బాపు బొమ్మకు పెళ్ళంట ప్రోమో యూ ట్యూబ్ లో విడుదల అయిన కొద్ది సేపటికే లక్ష కి పైగా వ్యూస్ రాబట్టింది. బాపు బొమ్మకు పెళ్ళంట, కొణిదెల నీహారిక ప్రోమో అంటూ కాప్షన్ పెట్టగా, అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. అంగ రంగ వైభవంగా బాపు బొమ్మకు పెళ్ళంట, వినాయక చవితి స్పెషల్ త్వరలో మీ జీ తెలుగు లో అని వస్తున్న పాట సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేంటో మీరు ఓ లుక్కేయండి.