అదిరిపోయే టీఆర్పీ రాబట్టిన నాగశౌర్య సినిమా..!

Friday, May 22nd, 2020, 10:31:04 AM IST


మన తెలుగు టాప్ మోస్ట్ ఛానెల్స్ లో జెమినీ ఛానెల్ కూడా ఒకటి. గత కొంత కాలం నుంచి అయితే కొత్త కొత్త సినిమాలను టెలివిజన్ వీక్షకులకు అందించడంలో ఈ ఛానెల్ మాత్రం ఇతర ఛానెల్స్ తో పోలిస్తే ముందుంటుంది. అలా ఈ లాక్ డౌన్ సమయంలో కూడా సరికొత్త సినిమాలను టెలికాస్ట్ చేస్తూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

అలా గత వరం టెలికాస్ట్ చేసిన “అశ్వథ్థామ” చిత్రం బాగానే పెర్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. నాగశౌర్య హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ చిత్రం గత వారపు ఆల్ టైం టాప్ 5 తెలుగు మోస్ట్ వ్యూడ్ ప్రోగ్రామ్స్ లో ఒకటిగా నిలిచింది.

మొత్తం 5 లక్షల 80 వేలకు పైగా ఇంప్రెషన్స్ ను రాబట్టి టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. దీనితో పాటు ఈ చిత్రానికి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయబడ్డ ఈ చిత్రానికి అత్యధికంగా 9.10 టీఆర్పీ వచ్చిందట.ఇది నాగ శౌర్య కెరీర్ లొనే బిగ్గెస్ట్ టీఆర్పీ. దీనికి ముందు టెలికాస్ట్ అయిన “హిట్” సినిమా తో పోలిస్తే ఇది బెటర్ గా పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు.