స్టైలిష్ స్టార్ సినిమాలకు మళ్లీ షాక్..!

Wednesday, August 5th, 2020, 10:42:04 AM IST

మన టాలీవుడ్లో అతి తక్కువ ప్లాప్స్ రేట్ ఉన్న హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరని చెప్పాలి. తాను నటించిన ఎన్నో సినిమాలు మొదట డివైడ్ టాక్ తో మొదలయ్యి బ్లాక్ బస్టర్స్ గా ముగిశాయి. అయితే బన్నీ నటించిన సినిమాలు అంటే ఒక్క మన దగ్గరే కాకుండా నార్త్ ఆడియన్స్ లో కూడా ఒక రేంజ్ రచ్చ ఉంది. అలా తాను నటించిన ఏ సినిమా అయినా సరే యూట్యూబ్ లో హిందీ వెర్షన్ రిలీజ్ అయితే 100 మిలియన్ సునాయాసంగా దాటాల్సిందే.

అలా తాను నటించిన లేటెస్ట్ చిత్రాలు పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా “సరైనోడు” మరియు మరో చిత్రం “డీజే” సినిమాలు 500 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టేసాయి. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ రెండు చిత్రాలూ యూట్యూబ్ నుంచి తీసేయబడ్డాయి.దీనికి కారణం ఇంకా తెలియాల్సి ఉన్నా దీనికి ముందు కూడా ఓ సారి 200 మిలియన్ వ్యూస్ వచ్చిన సరైనోడు చిత్రం కూడా యూట్యూబ్ నుంచి తొలగించబడింది.