గాల్లో సుమోలు లేచే డైరెక్టర్ ను తీసుకొచ్చిన ఆలీ.!

Thursday, February 13th, 2020, 05:53:46 PM IST

ఈటీవీ ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఎంటర్టైనింగ్ షోలలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే “ఆలీతో సరదాగా” ప్రోగ్రామ్ కూడా ఒకటి.అయితే ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ఎందరో మహామవులను ఈ షో ద్వారా తీసుకొచ్చారు.అలా ఇటీవలే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారిని తీసుకొచ్చారు.

అయితే ఓ దర్శకునిగా టాలీవుడ్ లో కోదండ రామిరెడ్డికి ఎంత పేరుందో తన చిత్రాలతో టాలీవుడ్ లో ఒక సెపరేట్ బెంచ్ మార్క్ ను బి గోపాల్ ఏర్పరచుకున్నారు.టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలకు అంటూ ఒక ట్రెండ్ తీసుకురావడమే కాకుండా గాల్లో సుమోలు లేవడం అనే ట్రెండ్ సెట్టింగ్ సీన్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడే బి గోపాల్.

ఒక నరసింహా నాయుడు,సమరసింహా రెడ్డి,ఇంద్ర ఇలా ఎన్నో పవర్ ఫుల్ చిత్రాలను అందించి అలాంటి పలు చిత్రాలను ఇతర దర్శకులు తెరకెక్కించేందుకు మార్గ దర్శకం అయ్యారు.అలాంటి బి గోపాల్ ను ముఖ్య అతిధిగా వచ్చారు.అలా వచ్చి ఎన్నెన్నో విషయాలను చెప్పారు.అంతే కాకుండా తాను బాలయ్యతో తీసిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలో ట్రైన్ సీన్ పై జరిగిన రచ్చ కోసం కూడా ప్రస్తావించారు.మరి ఇంకా ఇలా ఎన్ని విశేషాలను పంచుకున్నారో తెలియాలి అంటే వచ్చే ఫిబ్రవరి 17 సోమవారం రాత్ర్రి మీ ఈటీవీలో ప్రసారం కాబోయే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం ను తప్పక వీక్షించండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి