“బిగ్ బాస్ 4” నాగ్ రెమ్యునరేషన్ పై మరో క్రేజీ రూమర్.!

Sunday, August 2nd, 2020, 08:19:09 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన “బిగ్ బాస్” విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అలాగే దీని తర్వాత నాలుగో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈ షో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో అదిరిపోయే టీజర్ ను కట్ చేసి స్టార్ మా వారు కన్ఫర్మ్ చెయ్యడంతో ఈ కరోనా కాలంలో ఇళ్లకు పరిమితం అయ్యిన వారు ఈ షో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు.

అయితే గత సీజన్ ను అద్భుతంగా హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే మళ్ళీ హోస్ట్ గా ఈసారి కూడా హోస్ట్ చేస్తుండడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా షోను చెయ్యాల్సిన తరుణంలో కింగ్ నాగ్ చాలా ఆంక్షలనే పెట్టారు. అలాగే తన రెమ్యూనరేషన్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్రేజీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గత సీజన్ కే ఒక్కో ఎపిసోడ్ కు గాను 12 లక్షలు ఛార్జ్ చేసిన నాగ్ ఈసారి 14 లక్షలు తీసుకుంటుంన్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా 20 లక్షలు తీసుకుంటున్నారని మరో టాక్ కూడా వినిపిస్తుంది. మరి వీటిలో ఏది నిజమో తెలియాల్సి ఉంది.